బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ

రంపచోడవరం నియోజవర్గం: జనసేన టీడీపి సంయుక్తంగా నిర్వహిస్తున్న బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం గంగవరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కుంజం సిద్దు, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, మాజీ ఎంపీటీసీ, కోసు బుల్లియమ్మ కొమ్మన చిన్నారావు, జనసేన నాయకులు త్రినాద్ గవరాజు సరోజిని శివ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.