ఉండ్రాజవరం జనసేన మండల కమిటీ కార్యవర్గ సమావేశం

నిడదవోలు నియోజకవర్గం, జనసేన ఉండ్రాజవరం మండల కమిటీ కార్యవర్గ మొదటి అంతర్గత సమావేశం ఉండ్రాజవరం మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ ఆధ్వర్యంలో ఆదివారం ఉండ్రాజవరం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు అందరూ పాల్గొని ఉండ్రాజవరం మండలంలో పార్టీ చేపట్టవలసిన కార్యక్రమాల గురించి, సభ్యుల విధులు, విధానాలు, మండలంలో పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి, గ్రామ కమిటీలను నియమించటం కోసం కార్యాచరణ మొదలగు విషయాలు గురించి చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటి వరకూ ప్రతి సభ్యుడు ఒక కార్యకర్త ఇక నుండి మండల కార్యవర్గ సభ్యుడుగా మరింత బాధ్యతగా వ్యవహరించి పార్టీ కోసం పని చెయ్యాలని తెలియచేశారు.