అర్ణబ్‌కు బెయిల్ మంజూరు

రిపబ్లిక్ టివి ఎడిటర్‌ఇన్‌చీఫ్ అర్నాబ్ గోస్వామి మధ్యంతర బెయిల్ కోసం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అర్ణబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనను మధ్యంతర బెయిల్ పై విడుదల చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. అర్ణబ్ భావజాలం ఎలాంటిదైనా వ్యక్తి స్వేచ్ఛను హరించడం సబబు కాదని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా, ఈ కేసులో బాంబే హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో అర్ణబ్ గోస్వామి సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం రూ.50 వేల ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ముంబయి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి స్పష్టం చేసింది.