జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో బనగానపల్లె జనసేన

బనగానపల్లె నియోజకవర్గం: రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు చేస్తున్న డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా మూడవరోజు బనగానపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ డిజిటల్ క్యాంపెన్లో భాగంగా మూడవరోజు ఆదివారం పాతపాడు నుండి జోలపురం వెళ్ళు రహదారిపై నిరసన తెలపడం జరిగిందని.. వైసిపి ప్రభుత్వం నవరత్నాలని ఇస్తున్నామని చెప్పి గుంతలు మయమైన రోడ్లపై ప్రయాణికులు కింద పడి ఆకాశంలోని చుక్కలు చూసేలా చేస్తున్నారని.. రాష్ట్రంలోని అద్వాన స్థితిలో ఉన్న రోడ్లపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అధ్వానం ఉన్న రోడ్లపై జనసేన పార్టీ చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ కార్యక్రమానికి రికార్డ్ స్థాయిలో స్పందన వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో చర్చ నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసిం షేక్షావలి, నాగరాజు, సుధాకర్, కళ్యాణ్, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.