బీజేపీలో చేరిన బండ కార్తీకరెడ్డి

కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ బండా కార్తిక రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారు. జీహెచ్ఎంసి బీజేపీ ఎన్నికల అధ్యక్షుడు భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆమె బీజేపీలో జాయిన్ అయ్యారు. చేరిక అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఇది పెద్ద మలుపు అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తనను రెండుసార్లు మోసం చేసిందని, టిక్కెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని అన్నారు. బీజేపీలో అటువంటి మోసం జరగదనే ఉద్దేశ్యంతో పార్టీలో చేరినట్టు తెలిపారు. తాను కార్పొరేటర్ గా పోటీ చేయడం లేదని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని అన్నారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయబోతున్నట్టు ఆమె పేర్కొన్నారు. 2020 జీహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీ సొంతం అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా బీజేపీ గెలుపుకోసం పనిచేసారని. ఈ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు బీజేపీ గెలుపుకోసం పనిచేస్తామని బండా కార్తీక రెడ్డి పేర్కొన్నారు.