సంగీత సాయి గుణరంజన్ కు నివాళులర్పించిన బండారు

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలంలోని, పినపళ్ల గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు స్వర్గీయ సంగీత సాయి గుణ రంజన్ కు, 54వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, వారి తమ్ముడు పినపళ్ళ గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్, తన అన్న స్వర్గీయ సాయిగుణ రంజన్ పేరుమీద ఒక గొప్ప ఉచిత మెగామెడికల్ సేవ కార్యక్రమం తలపెట్టి, ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ద్వారా పేద ప్రజల కోసం, వృద్ధుల కోసం, నిరుపేద మహిళల కోసం ఉచిత వైద్య సేవలు, ఉచితంగా మందులు అందించడం చాలా చాలా గొప్ప విషయమని వారిని, వారి కుటుంబ సభ్యులను ఎంతో అభినందించదగ్గ పరిణామమని, ఇటువంటి మంచి మనసున్న వ్యక్తులు, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు, సాహస కార్యక్రమాలు చేసే వారు చాలా అరుదుగా ఉంటారని, తన అన్న సాయి గుణరంజన్ ఆశయం కోసం, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకొరకు నడుం బిగించి, పినపళ్ళ గ్రామ సర్పంచ్ గా పలు సేవా కార్యక్రమాలు చేయడం చాలా హర్షించదగ్గ విషయమని, ఈ సందర్భంగా జనసేన కుటుంబం తరఫున, కొత్తపేట నియోజకవర్గం ప్రజల తరఫున, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు, పినపళ్ళ గ్రామ సర్పంచ్ సుభాష్ ను గొప్పగా అభినందించుచున్నానని, ప్రముఖ జనసేననేత బండారు శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సంగీత సుభాష్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎన్నారై రాయుడు వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ఈ సేవా కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్నారు. పలువురు సీనియర్ జనసైనికులు, ప్రముఖ జనసేన నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రముఖ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు తాళ్ల డేవిడ్ రాజ్, జిల్లా కార్యదర్శులు, ప్రముఖ బీసీ శెట్టిబలిజ జనసేన నాయకులు దొంగ సుబ్బారావు, బొక్క ఆదినారాయణ, రావులపాలెం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తోట స్వామి, తులా రాజు మరియు ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సురపు రెడ్డి సత్య, సీనియర్ జనసేన నాయకులు గారపాటి త్రిమూర్తులు, ఎంపీటీసీ సభ్యులు ప్రముఖ నాయకులు, పెద్దిరెడ్డి పట్టాభిరామన్న, జాంపోలు నాగేశ్వరరావు, తమ్మన భాస్కరరావు, సందిపూడి సర్పంచ్ తోట భవాని, వెంకటేశ్వర్లు, సందిపూడి ఎంపిటిసి సభ్యులు తోలేటి సంతోషిని,మూలస్థానం సర్పంచ్ లంకె వరప్రసాద్, మరియు ఉపసర్పంచ్, మూలస్థానం సీనియర్ యువ జనసేన నాయకులు జయప్రకాష్నారాయణ, పడాల అమ్మి రాజు, కొత్తపళ్లి నగేష్ పినపళ్ళ ఉపసర్పంచ్ యనమదల శ్రీను, ధనరాజ్ నాయుడు, కోట వరలక్ష్మి, తోట ఆశ, నాగిరెడ్డి మహేష్, బైరి శెట్టి రాంబాబు, ఆలమూరు జనసేన అధ్యక్షులు కట్టా రాజు, చింతలూరు జనసేన అధ్యక్షులు దేశభక్తుల సత్యనారాయణ, సంగీత వీరబాబు, ప్రముఖ కాపు యువ ఉద్యమ నాయకులు పెద్దిరెడ్డి మహేష్, వనుం సూరిబాబు, సూర్యారావుపేట శెట్టిబలిజ నాయకులు, ఉండమట్ల నాగశివ, పినపళ్ళ గ్రామ ప్రజలు, జనసైనికులు కార్యకర్తలు మహిళలు, పలు గ్రామాల ప్రజలు, మహిళలు పిల్లలు అధిక సంఖ్యలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లో పాల్గొన్నారు. వచ్చిన వారికి అందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది.