కణితి కిరణ్ ఆధ్వర్యంలో టెక్కలి జనసేన ఆత్మీయ సభ

టెక్కలి జనసేన పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ కణితి కిరణ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాలుగు మండలాల జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశంలో కణితి కిరణ్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి త్వరలో గ్రామ, మండల స్థాయి కమిటీలు వేస్తామని, అలాగే బూత్ స్థాయిలో బలోపేతానికి బూత్ ఏజెంట్లను నియమించి పార్టీ ప్రతి కార్యక్రమాన్ని గ్రామాల్లో బలంగా జనాల్లోకి తీసుకు వెళ్లాలని తెలిపారు. పార్టీ బలోపేతంలో భాగంగా వీర మహిళలను సాదరంగా ఆహ్వానించాలని, మహిళలను పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యులుగా చెయ్యాలని తెలిపారు. గ్రామస్థాయిలో ఉన్న జనసైనికులు ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని.. అలాగే ఓటుహక్కు పొందేలా చెయ్యాలని తెలిపారు. ప్రస్తుత వైసీపీ నాయకత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి గ్రామస్తునకు తెలియజేసి జనసేన అధికారంలోకి వస్తే షణ్ముఖ వ్యూహం అనుసరించి ఈ రాష్ట్ర యువతకు ఏవిదంగా ఉపాధి కల్పిస్తుందో వివరించాలని, రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి ఎలా గట్టేంకించాలో మన అదినాయకుడివద్ద ప్రణాళిక ఉందని తెలిపారు. త్వరలోనే వైసీపీ వ్యతిరేక విధానాలను జనశ్రేణులు వీధి పోరాటాలు తో జనాలకు వివారిస్తాయని తెలిపారు.