సంధిపూడి రైతుల నిరసన కార్యక్రమంలో బండారు శ్రీనివాస్

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండల సంధిపూడి గ్రామములో రెండవ రోజు జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కొత్తపేట జనసేన ఇంచార్జీ బండారు శ్రీనివాస్ పాల్గొని సంఘీభావం తెలిపారు. గతంలో ఓఎన్జీసీ ఇచ్చిన హామీలను విలుపుకోవాలని ఆగ్రామాల రైతులు గత రెండు రోజులుగా ఆందోళన చేపడతున్న స్పందించక పోవడం ఆశ్చర్యమైన విషయం అన్నారు. గత నాలుగు, సంవత్సరాలుగా ఓఎన్జీసీ వారి వారి కార్యకలాపాలు జరుపు కుంటున్నా ఆయా గ్రామాలను అభివృద్ధి చేయకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా మళ్ళీ డ్రిల్లింగ్ చేపట్టడాన్ని రైతులు వ్యతిరేకించడంలో న్యాయం ఉందని, వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కాకుండా వారు చేస్తున్న నిరసన గ్రామాభివృద్ధి తోడ్పడుతుందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా పుంత రోడ్లను, అత్యవసర మైన రహదారులు వేయాలని వారు డిమాండ్ చేశారు. ఓఎన్జీసీ అధికారులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోక పోవడం వల్లే రైతులు ఆందోళన బాట చేపట్టారు అని బండారు శ్రీనివాస్ అన్నారు. అధికారులు వారి పనులు చేసుకుంటూ వారు ఇచ్చే అర కొర హామీలు మాటల వరకే పరిమితమైన విషయం ప్రజలు గమనిస్తున్నారని, వారు లిఖిత పూర్వక హామీలు రైతులకు ఇవ్వాలని బండారు శ్రీనివాస్ అధికారులకు సూచించారు. జనసేన పార్టీ రైతులకు తోడుగా ఉంటుందని, వారు ఆశించిన అభివృద్ది పనులు జరిగేవరకు పోరాటం చేయడానికి తాము సిద్దమని బండారు శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అనంతరం సందిపుడి సర్పంచ్ తోట భవాని రెండవ రోజు నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపిన కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జీ బండారు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి తాళ్ల డేవిడ్, జనసేన జిల్లా కార్యదర్శి సంగీత సుభాష్, నల్లా వెంకన్న, ఆలమూరు మండల అధ్యక్షులు సూరప్పరెడ్డిసత్య, కొత్తపల్లి నగేష్, సలాది జయప్రకాశ్ నారాయణ(జెపి) సందిపూడి సర్పంచ్ తోట భవాని వెంకటేశ్వర్లు, గారపాటి తిరుమూర్తిలు, పడాల అమ్మిరాజు, ధనరాజ్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.