2024లో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తేల్చి చెప్పిన ఉపాధి కూలీలు: కరిమజ్జి మల్లీశ్వారావు

  • పవనన్న ప్రజాబాట 60వరోజు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అర్జునవలస గ్రామ చెరువులో ఉన్న ఉపాధి కూలీలతో జనసేన పార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు జనసేన పార్టీ యంపీటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు మంగళవారం ఉదయం 9:00 గంటలకు చెరువులో పర్యటించారు. చెరువులో ఉన్న ప్రతి ఒక్కరూను కలవడం జరిగింది.జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి ప్రతి మహిళకు, యువతకు, పెద్దలకు తెలియజేయడం, పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 60 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాట సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్రలో బాగంగా 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే గ్రామ ప్రజలకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే జనసేన ప్రభుత్వం వస్తే సంవత్సరానికి 5 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పేదలకు ఇవ్వబడుతుంది. ప్రతి పేద ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి తెల్లరేషన్ కార్డు కలిగినవారికి ఇసుక ఉచితంగా ఇవ్వబడుతుంది. అలాగే తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ బదులు 2500/-నుండి 3500/-వరకు ఎకౌంటులో నగదు జమ చేయబడును. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసిపికి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో అర్జునవలస గ్రామప్రజలు మహిళలు జనసైనుకు కెల్లా బాక్కరావు, కెల్లా బానుప్రసాద్, కెల్లా కళ్ళాణ్ రావు తదితరులు పాల్గొన్నారు.