Kothapeta: తుఫాన్ బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలి – బండారు శ్రీనివాస్

తుఫాన్ బాధిత రైతులకు ప్రభుత్వం ఎకరాకు 30వేలు తక్షణ సాయం అందించాలని డిమాండ్! కొత్తపేట ప్రధాన రహదారి రోడ్డు సమస్యలు పట్టవా? బండారు శ్రీనివాస్ జనసేన ఇంచార్జ్!

అధిక వర్షాలకు, తుఫానులకు, నియోజకవర్గ నాలుగు మండలాల రైతులు ధైర్యంగా ఉండాలని, ఎవరూ అధైర్యం చెందవద్దని, రైతులకు అండగా మేముంటామని, ప్రభుత్వము తక్షణ సహాయం కింద 30వేల రూపాయలు ఎకరాకు అందించాలని, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, శ్రీ బండారు శ్రీనివాస్ తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, అధిక వర్షాలకు, తుఫానులకు కొత్తపేట నియోజకవర్గంలో, నాలుగు మండలాల్లో ఉన్న రైతుల వరి చేలు నీట మునిగి పాడైపోయి ఉన్న పంట పొలాలను చూసి రైతులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని, నియోజకవర్గంలో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారని, వెంటనే తక్షణ సాయం కింద ప్రభుత్వం ఎకరాకు 30 వేల రూపాయలు తగ్గకుండా నష్ట పరిహారం ఇప్పించి, రైతులకు ధైర్యం ఇవ్వాలని, జనసేన పార్టీ నేతగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బండారు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులు ఎవరూ ఆధైర్యం చెందవద్దని, రైతులకు న్యాయమైన నష్టపరిహారం వెంటనే అందే విధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామని, రైతుల పక్షాన నిలబడతామని అన్నారు. అంతేకాకుండా కొత్తపేట నియోజక వర్గంలో రావులపాలెం టు కొత్తపేట ప్రధాన రహదారి చాలా అధ్వానంగా, భయంకరంగా ఉన్నదని, ప్రజలు రహదారి వెంట వాహనాలపై, బస్సులపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించవలసివస్తుందని, ప్రధాన రోడ్లపై అధిక లోతుతో కూడిన గోతులు, గుంటలు చెరువులను తలపిస్తున్నాయని, వెంటనే రహదారి పనులకు నాణ్యమైన మెటీరియల్స్ తో రోడ్డు పనులు ప్రారంభించాలని, మా ప్రధాన డిమాండ్! అని బండారు శ్రీనివాస్ తెలియజేశారు.