సూర్యారావుపేట గ్రామంలో పర్యటించిన బండారు

తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండలంలోని, సూర్యారావుపేట గ్రామముయందు ఆదివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ మరియు ప్రముఖ జనసేన నేత బండారు శ్రీనివాస్ పర్యటించారు. ఈ సూర్యారావుపేట గ్రామంలో కొద్ది రోజుల క్రితం శెట్టిబలిజ కులమునకు చెందిన గ్రామ పెద్ద కాలా రామదాసు స్వర్గస్తులైన కారణంగా, ఆ కుటుంబ పెద్దను కోల్పోయిన, కుటుంబ సభ్యులను పరామర్శ చేసినారు, వారి మనవడు సూర్యరావుపేట జనసేన నాయకుడు కడలి రమేష్ ను కలిసి, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కుటుంబ పెద్ద లేని లోటు చాలా బాధాకరమని, ధైర్యంగా ఉండాలని కడలి రమేష్ కు, కుటుంబ సభ్యులకు, బండారు శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు శెట్టిబలిజ నాయకులు, బండారు శ్రీనివాస్ రాక సందర్భంగా వారితో కొద్దిసేపు కలిసి మాట్లాడారు. వీరి వెంట కొత్తపేట మండలం జనసేన నాయకులు తులా రాజు, నాగిరెడ్డి మణికంఠ, ఆలమూరు జనసేన నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజు, ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సూరపు రెడ్డి సత్య, మరియు సూర్యారావుపేట గ్రామ శెట్టి బలిజ నాయకులు కాలా సాయి బాబా, కాలా సూరి, కడలి శ్రీను, కాల ప్రసాద్, మరియు కాలా రాందాస్ కుమారులు నాగేశ్వరరావు, రామకృష్ణ, శ్రీనివాస్, సూరిబాబుతోపాటు, సూర్యారావుపేట గ్రామ జనసేన నాయకులు కడలి రమేష్, ఎం.కిరణ్, ఎల్.ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.