తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనల భజనలను నిషేధించడం అపచారం: జనసేన

తిరుమల తిరుపతి దేవస్థానంలో “వెంకన్న భజన” కాకుండా “ధర్మారెడ్డి కి భజన” చేయాలా? అఖిలపక్షం సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ .. ధర్మారెడ్డి తిరుమలకి వచ్చాక టీటీడీని భ్రష్టు పట్టించాడు. జానపదకళాకారుల పొట్ట కొట్టాడు. అతని మీద పోరాడాల్సిన అవసరం ఉందని, ఇప్ఫుడు అన్ని రాజకీయ పార్టీలు మరియు అన్ని సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.