బాపట్ల-భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను కలిసిన జనసేన పార్టీ

జనసేననాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా, బాపట్ల నియోజకవర్గం లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు గారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ రైతు కష్టపడి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతుంటే ఈ ప్రభుత్వము పట్టించుకోవడంలేదని, ఇంతవరకు ప్రభుత్వ అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని పంటపొలాలను పరిశీలించడం గానీ, నష్టపోయిన రైతులను ఓదార్చడం గానీ, వారికి తగిన సహాయం అందించడం గాని జరగలేదని, ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని, రైతు భరోసా కేంద్రాలు పేరుకే కానీ అవి ఏ విధంగానూ రైతులకు ఉపయోగకరంగా లేవని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి గారు వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటాం లో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి జరిగిన పంట నష్టానికి అంచనావేసి ఎకరానికి 30 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించి, రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని నాణ్యత తో సంబంధం లేకుండా మద్దతు ధరకే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివన్నారాయణ, జిల్లా కార్యదర్శి నక్కల వంశీకృష్ణ, గుంటూరు పట్టణ నాయకులు బాలు శిఖా, కొండూరు కిషోర్, సురేంద్ర, బాపట్ల జనసేన పార్టీ నాయకులు ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, గొగన ఆదిశేషు,ఆరమల్ల సుజిత్, కొట్ర మణికంఠ, బడే అంకమ్మరావు, కర్లపాలెం మండలం జనసేన పార్టీ నాయకులు మడసాని బాలాజీ,S.రాంబాబు, T.సింగారావు,M. శ్రీనివాస రావు, I. శ్రీనివాస రావు, I. చౌదరి,G. వెంకట రామారావు, తాండ్ర రాధాకృష్ణ మరియు రైతులు & జనసైనికులు పాల్గొన్నారు.