భోగాపురం ఎయిర్ పోర్టు నిర్వాసితులకు మౌళిక సదుపాయాలు కల్పించాలి: నెల్లిమర్ల జనసేన

నెల్లిమర్ల: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో పూసపాటిరేగ మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్రింద విషయాలు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఎయిర్ పోర్టు నిర్వాసితులకు తక్షణమే మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శంకుస్థాపనల పర్వం నడుస్తుందని భవనాలు ప్రాజెక్టులు ఆవిష్కరణల ఊసే లేదని తెలియజేసారు. మత్స్యకార యువత ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు తరలిపోయి రోజులు లెక్కబెట్టుకుని బ్రతుకుతున్నారని, ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు గడిచింది ఇప్పుడు జెట్టీకి శంకుస్థాపన చేయడం ఎన్నికల స్టంట్ మాత్రమే అని అన్నారు. నియోజకవర్గంలో బహుళ ప్రాయోజిత ప్రాజెక్టు అయిన తారకరామ తీర్థసాగర్ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియజేయాలని అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగం కల్పించేలా రూపొందించిన జీవో అమలు ఎప్పుడు జరుగుతుందో చెప్పాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్, రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, పూసపాటిరేగ, నెల్లిమర్ల, భోగాపురం మండల అధ్యక్షులు జలపారి శివ, పతివాడ అచ్చెన్నాయుడు, వందనాల రమణ, డెంకాడ మండల అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, దిండి రామారావు, తొత్తడి సూర్యప్రకాష్, తుమ్మి అప్పలరాజు దొర, బలభద్రుని జానకీరామ్, దుక్క అప్పలరాజు, లింగం రమేష్, బండారు విశ్వనాథ్ తదితర జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్, రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, పూసపాటిరేగ, నెల్లిమర్ల, భోగాపురం మండల అధ్యక్షులు జలపారి శివ, పతివాడ అచ్చెన్నాయుడు, వందనాల రమణ, డెంకాడ మండల అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, దిండి రామారావు, తొత్తడి సూర్యప్రకాష్, తుమ్మి అప్పలరాజు దొర,బలభద్రుని జానకీరామ్, దుక్క అప్పలరాజు, లింగం రమేష్, బండారు విశ్వనాథ్ తదితర జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.