ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజలకు అండగా ఉండే పార్టీ జనసేన

  • ఎదురువారిపాలెం గ్రామానికి రహదారిని నిర్మించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపిన జనసేన నాయకులు మరియు గ్రామ ప్రజలు

కొండపి నియోజకవర్గం: ఎదురువారిపాలెం గ్రామానికి రహదారిని నిర్మించినందుకు జనసేన పార్టీకి, అధికారులకు ఎదురువారిపాలెం గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో చెన్నిపాడు పంచాయతీలో ఎదురువారిపాలెం గ్రామంలో కొన్ని రోజుల క్రితం పర్యటించి ఆ గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరిగింది, ఈ గ్రామం ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలు దాటింది, ఆ గ్రామంలో 100 కుటుంబాలు వారు దాదాపు 500 నుండి 700 వరకు ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు, వారంతా మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులకు మేము గుర్తుకు వస్తున్నాము తర్వాత మమ్మల్ని పట్టించుకునే వారు లేరని వారి సమస్యలను విన్నవించుకున్నారు. మా ఊరిలో మంచినీటి సదుపాయం లేదు, మంచినీటి సదుపాయం కోసం వాటర్ ట్యాంక్ ని నిర్మిస్తామని డ్రైనేజ్ కాలువలు నిర్మిస్తామని, అంగన్వాడి స్కూల్ ని కూడా నిర్మిస్తామని, 1వ తరగతి నుండి 5 తరగతుల వరకు ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కి చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తామని, గ్రామంలో సిసి రోడ్లు వేస్తామని, ఇల్లు లేనివారికి ఇల్లు కూడా కట్టిస్తామని హామీలిచ్చి, చెన్నిపాడు నుండి ఎదురువారిపాలంనకు రావడానికి మూడు కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారిని నిర్మిస్తామని చెప్పి ఈరోజు నాయకులు మొహం చాటేస్తున్నారు అని ఆ గ్రామ ప్రజలంతా జనసేన నాయకులు పర్యటించినప్పుడు వారితో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో అయితే ఈ రహదారిలో రావాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రావాల్సిన పరిస్థితి నెలకొంది. మా ఊరిని అభివృద్ధి పరచాలంటే జనసేన ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు అంటున్నారు. మా ఊరు ఏర్పడి 30 సంవత్సరాలు దాటింది ఇప్పటివరకు సరైన రోడ్లు లేవు, మంచినీటి సదుపాయాలు లేవు, కనీసం వీధి లైట్లు లేవు, వర్షాకాలం వస్తే ఊరు దాటి బయటకు రావాలంటే చాలా కష్టంగా మారుతుంది, ఇలాంటి అంధకారమైన పరిస్థితుల్లో ఈ గ్రామంలో ప్రజలు నివసిస్తుంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ హయాంలో తర్వాత టిడిపి హయాంలో తర్వాత వైస్సార్సీపీ నాయకులు కూడా ఈ గ్రామంలో పర్యటించి మీ గ్రామానికి సంబంధించి అన్ని అభివృద్ధి పనులు మేము చేసి పెడతామని నమ్మబలికి ఓట్లు వేయించుకొని సీట్లు గెలిచిన తర్వాత మొహం చాటేస్తున్నారు, మమ్మల్ని గుర్తించి మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి అని జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ తో ఆ గ్రామ ప్రజలు ఆవేదనతో తెలియజేశారు, ఈ ఎదురువారిపాలెం గ్రామాన్ని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పట్టించుకుని అభివృద్ధి చెయ్యాలని జనసేన నాయకులు డిమాండ్ చేసి ఆ గ్రామ సమస్యలు మొత్తాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, అధికారులు వెంటనే స్పందించి ఖచ్చితంగా ఎదురువారిపాలెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని జనసేన పార్టీ నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది, అధికారులు చెప్పినట్టుగానే ఈరోజు ఆ గ్రామంలో ఉన్న ప్రధాన రహదారిని నిర్మించి, అదే విధంగా వాటర్ ట్యాంక్ ని కూడా నిర్మించడం జరిగింది, జనసేన పార్టీ ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూ ఉంది, ప్రజలకు అండగా ఉంది అని ఆ గ్రామ ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తపరిచారు, అధికారులకు మరియు జనసేన పార్టీ నాయకులకు ఆ గ్రామ ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేశారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.