రెల్లి కులస్తులకు మౌళిక సదుపాయాలు కల్పించాలి: జనసేన వినతి

గుంటూరు 21వ వార్డు కొండ వెంకటప్పయ్య కాలనీ 1వ లైన్లో నివాసముంటున్న రెల్లి కులస్తులకు కనీస సౌకర్యాలైన మంచినీరు, వీధిలైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు స్పందన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికులు నివసించే ఏరియాలలో వీధిలైట్లు, వీధి కుళాయిలు లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ప్రజలకు కనీస అవసరాలు కూడా తీర్చకపోతే ఎలా అని కమిషన్ గారిని గట్టిగా అడగటం జరిగింది. కమిషన్ గారు పారిశుద్ధ కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే జనసేన పార్టీ తరఫున వారికి న్యాయం చేసే వరకు తోడు ఉంటామని అవసరమైతే రోడ్డు ఎక్కుతామని తెలియజేశారు. సదరు సమస్యలపై స్పందించిన కమిషనర్ గారు వీధి కుళాయిలు మరియు వీధిలైట్లు తక్షణమే వేయిస్తామని హామీ ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు 21వ వార్డు సందర్శించి రెండు వీధిలైట్లు ఒక వీధి పంపు వేయుటకు రెండు రోజుల సమయం పడుతుందని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. సదరు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలకు ఒక పరిష్కారం దొరికిందని రెల్లి కులస్తులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కు ధన్యవాదాలు తెలియజేశారు.