Razole: విద్యార్ధులపై పోలీసుల దాడి అమానుషత్వం

అనంతపురంలో తమ ఎయిడెడ్ కళాశాలను మూసివేయద్దు అని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై ఆడ పిల్లలు అని కూడా చూడకుండా పోలీసులతో తలలు పగలకొట్టిస్తారా! పోలీసు చేతిలో విద్యార్థులు గాయపడటం దురదృష్టకరం… ఇటువంటి నిరంకుశత్వ తీరు ప్రభుత్వం మనుగడకే ప్రమాదమని, ఈ సంఘటనపై బాధ్యులను మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన తరపున డిమాండ్ చేస్తున్నామని రాజోలు నియోజకవర్గం కాట్రేనిపాడు ఎంపీటీసీ అడబాల శ్రీనివాసరావు అన్నారు.