జనసైనికుడు గణేష్ కుటుంబానికి బత్తుల దంపతులు లక్ష రూపాయల ఆర్థిక సహాయం

రాజానగరం: జనసేన పార్టీకి ఎనలేని సేవలందించి, ఇటీవల తిరిగిరాని లోకాలకు మనందరినీ వదిలి వెళ్లిపోయిన మన జనసేన కుటుంబసభ్యుడు, కోరుకొండ మండలం, బొల్లెద్దుపాలెం గ్రామానికి చెందిన.. నిస్వార్థ జనసైనికుడు పుప్పాల గణేష్ కుటుంబ సభ్యులను.. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరొకసారి పరామర్శించి, మనోధైర్యం కల్పించి.. గణేష్ కు అశ్రునయనాలతో ఘననివాళులు అర్పించి.. వారి కుటుంబానికి చేదోడుగా ఉండాలని ఉద్దేశంతో 1,00,000/- (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయం అందజేసి, జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ చెక్ ని శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ, బొల్లెద్దుపాలెం సీనియర్ నేత కట్టా వెంకన్నబాబు, ఇతర నేతల చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఏ ఆపద వచ్చినా.. మేమున్నామంటూ.. శక్తికొలది దానధర్మాలు చేస్తున్న సేవాతత్పరులు బత్తుల దంపతులకు జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.