జనంకోసం జనసేన మహా పాదయాత్ర 31వ రోజు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగింది. నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, జనసేన శ్రేణులు సంయుక్తంగా జనసేన పార్టీ విధి విధానాల ముద్రించిన కరపత్రాలు పంచుతూ, నిస్వార్ధపరుడు, నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ కి ఈసారి అవకాశం ఇవ్వాలని, చాపకింద నీరులా రాష్ట్రం నలుమూలల ప్రజాదరణతో రోజురోజుకీ బలపడుతున్న జనసేన పార్టీని రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలు సహకరించాలని, జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు జరిగే మేలును, సమాజంలో వచ్చే మార్పును వివరిస్తూ, గ్రామంలో ప్రజల ఆదరణతో ఈ పాదయాత్ర ముందుకు సాగింది. జనసేన మహా పాదయాత్రలో మట్ట వెంకటేశ్వరరావు, దాసరి కోటేశ్వరరావు, కోనే శ్రీను, గడగట్టి ప్రశాంత్ కుమార్, ముత్యాల హరీష్, మోహన్ పిఎస్పికె, మాధవరావు, వీరభద్రరావు, రొంగలి అభిరామ్ నాయుడు, కొండటి సత్యనారాయణ, మట్ట సుబ్రహ్మణ్యం, మాధవరం కోటేశ్వరరావు, అడపా నరసింహ, కవాళ్ళ సురేష్, ప్రగడ శ్రీహరి, మూర్తి, బైలపూడి శ్రీను, సందీప్ ముగ్గుల, రుద్ర నాగు, బాషా, బ్రహ్మ లతో పాటు నియోజకవర్గ జనసేన శ్రేణులు గల్లా రంగా, వేగిశెట్టి రాజు, నాతిపాము దొర, అరిగెల రామకృష్ణ, గాడాల జనసైనికులు, చిట్టిప్రోలు సత్తిబాబు, కమిడి సత్యనారాయణ, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, అడబాల సత్యనారాయణ, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.