పాడి రైతుకు యాభైవేల ఆర్ధికసాయమందించిన బత్తుల దంపతులు

  • విషపూరితమైన దాణా (ఆహారం) తిని మృత్యువాత పడ్డ పశువులకు(గేదెలు) సంబంధించిన రైతుకు బత్తుల బలరామకృష్ణ ₹50,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం.
  • సాటి రైతు మీద ద్వేషంతో, పైశాచిక ఆనందం కోసం మూగజీవాలను మట్టుబెట్టడం అత్యంత హేయమైన చర్య.
  • ఇలాంటి క్రూరమైన పనులు చేసే దుర్మార్గులను పోలీస్ వారు గుర్తించి కఠినంగా శిక్షించాలి

రాజానగరం నియోజకవర్గం, సీతారామపురం గ్రామంలో సాధిక వరహాలు అనే రైతు వారి డిగ్రీ చదివిన ఇద్దరు కుమారులతో కలిసి జీవనోపాధి కోసం పన్నెండు గేదెలను, నాలుగు ఆవులను చిన్న డెయిరీగా పెట్టి జీవనోపాధి సాగిస్తుండగా అసూయతో ఇది గిట్టని వారు ఎవరో పశువుల తినే దాణాలో రాత్రిపూట గడ్డిముందు (విషం) కలపడం. అది గమనించని సాధిక వరాహాలు ఆ దాణాని పశువులకు(గేదెలకు) ఉదయం పూట అందించడం జరగ్గా ఆ దాణా తిని ఇప్పటికే మూడు గేదెలు మృత్యువాత పడ్డాయి. మరో ఆరు గేదెల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. జనశ్రేణుల ద్వారా జరిగిన దుర్ఘటన తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆ రైతు ఏర్పాటు చేసుకున్న పశువులదొడ్డును సందర్శించి దిగ్భ్రాంతికి లోనై ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయిన ఒక్కో గేదెకు లక్ష యాభై వేల రూపాయలు రైతుకు నష్టపరిహారం అందించాలని మిగిలిన గేదెలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు, పశువులు కోల్పోయిన సాధిక వరహాలుకి తాత్కాలిక ఉపశమనం కొరకు తక్షణం సాయం కింద బత్తుల బలరామకృష్ణ ₹50,000/౼ వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు కన్నీరు పెట్టిన ఏ నేలా సుభిక్షంగా ఉండదని, అసలు రైతనే వాడే లేకపోతే మనకు ఆహారమే దొరకదని, ఇప్పటికే పాడి రైతులు అనేక ఇబ్బందులు గురవుతూ జీవనోపాధి సాగిస్తున్న ఇటువంటి తరుణంలో ఇలా గుర్తుతెలియని దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని, పోలీసు వారు తక్షణమే దుండగులను గుర్తించి మరొకచోట ఇలా జరగకుండా చూసి, దోషులును కఠినంగా శిక్షించాలని, అలానే రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక అనేక చోట్ల కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అటువంటివి జరగకుండా చూసి, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, ముఖ్యంగా ఈ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని, రైతు పడుతున్న కష్టాల గురించి లోతైన విశ్లేషణ జరగి, వారికి న్యాయం జరగాలని బత్తుల బలరామకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు కిమిడి శ్రీరామ్, మెడిశెట్టి శివరాం, అడబాల ఆదివిష్ణు, శంకరం, చల్లా రాము ఇతర జనసేన నాయకులు, జనసైనికులు సీతారాంపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.