పంతం నానాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బత్తుల దంపతులు

కాకినాడ రూరల్, జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ వారి స్వగృహం నందు నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, పార్టీకి వారు చేస్తున్న సేవలకు చిరు సత్కారం అందజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో సర్పంచులు కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, అడ్డాల శ్రీను, బోయిడి వెంకటేష్, కురుమళ్ళ మహేష్, చిట్టిప్రోలు సత్తిబాబు, నాతిపం దొరబాబు, దొడ్డ బాలకృష్ణ, అడ్డాల దుర్గాప్రసాద్, తదితర నాయకులు, జనసైనికులు పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు.