ముగ్గళ్ల గ్రామంలో 300 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన బత్తుల

రాజానగరం, సీతానగరం మండలం, మిచౌంగ్ తుఫాన్ దాటికి కురిసిన అతి భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల ముగ్గళ్ల గ్రామం, దాని చుట్టు పక్కల ఉన్న పరిసర గ్రామాలన్నీ లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల జలదిగ్బంధమై ఇంట్లో నడుము లోతు నీరు నిలిచిపోవడం వల్ల కనీసం ఆహారాన్ని వండుకునే అవకాశం లేకుండా జనం ఇక్కట్లు పడుతున్నారు. త్రాగేందుకు నీరు లేదు, నిత్యవసర సరుకులు అన్నీ తడిచిపోయి పాడైపోయాయి. భోజనం టిఫిన్ వంటి కనీస ఆహారం లేక చిన్న పిల్లలు, వయోవృద్ధులతో కుటుంబాలన్నీ ఆకలితో అలమటిస్తున్నారు. వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వాధికారి గానీ, ప్రజా ప్రతినిధులు గాని, ఓట్ల కోసం వెంబడించే వాలంటీర్లు గాని, స్థానిక ఎమ్మెల్యే గాని చూసిన పాపాన పోలేదు. ప్రజలంతా తిండి, నిద్ర కనీసం కూర్చోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో రోడ్లపై మేడలపై, ఇంటి ముంగిట వరద నీటిలో నిలుచుని సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ తన టీంతో వచ్చి కన్నీటి పర్యంతమై తక్షణం గ్రామ ప్రజలకు బియ్యం, కూరగాయలు, మంచినీరు, నిత్యావసర సరుకులతో పాటు ఆహారం అందించడం జరిగింది.