శ్రీశ్రీశ్రీ దేవి గౌరీ శంకరుల రథోత్సవంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ రథోత్సవ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ గౌరీశంకరుల రథోత్సవ కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు శ్రీరంగపట్నం ఆడపడుచులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పట్టు చీర & తాంబూలం సమర్పించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు, మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. అనంతరం రధోత్సవంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇతర జనసేన, తెలుగుదేశం నాయకులతో కలిసి స్వామి వారి రథాన్ని ముందుకు కదిలించడం జరిగింది. అమ్మ వారి సారి కార్యక్రమంలో పాల్గొన్న ఆడపడుచులు అందరికీ బొట్టు పెట్టు 1000 మందికి జాకెట్ ముక్కలు పెట్టిన బత్తుల. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.