శ్రీశ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి అన్న సమారాధనలో పాల్గొన్న బత్తుల

రాజానగరం, కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలో వెంచేసియున్న శ్రీశ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని అమ్మవారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతీ ఒక్కరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం భారీగా ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నవితరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వారికి ₹5000 /- విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ముక్కా రాంబాబు, మారిశెట్టి త్రిమూర్తులు, కర్రీ దొరబాబు, వెలిసేటి రామచంద్రరావు, వెలిసేటి సుబ్బారావు, బండి స్వామి, వెలిసేటి సత్యనారాయణ, కోన అప్పారావు, గళ్ళ నాగు, తర్ర నాని, వెలుసేటి రాకేష్, వెలిసెటి భాస్కర్, వెలిసేటి మణికంఠ, గెట్టా సతీష్, గుర్రం లోవరాజు, నందికం శేషగిరి, చల్లపల్లి రాముడు, అడపా వీరబాబు, గెట్ట లతిష్, వెలిసేటి శ్రీహరి, వెలిసేటి అయ్యప్ప, యు. నాగేంద్ర, యు వీరబాబు, గళ్ళ ప్రసాద్, గళ్ళ శివ, ఇండల శ్రీను మరియు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.