లంకమ్మ తల్లి అమ్మవారి అన్న సమారాధనలో పాల్గొన్న బత్తుల

రాజానగరం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన లంకమ్మ తల్లి అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రతీ ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భారీగా ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నవితరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వారికి ₹5000 /- విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటు మట్టా వెంకటేశ్వరరావు, కొండేటి సత్యనారాయణ, మట్టా సుబ్రహ్మణ్యం, చీకట్ల వీర్రాజు, యడ్లపల్లి శ్రీను, పెంటపట్టి శివ, బండి సత్యప్రసాద్, మట్టా మని, మాగాపు సత్యనారాయణ మరియు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.