న్యాయపోరాటంలో విజయం సాధించిన బలరాముడు

  • దళిత కుటుంబానికి 7 లక్షల వరకు ఆర్ధికసాయమందేలా పోరాటం చేసిన బలరామకృష్ణుడు
  • అర్ధరాత్రి సమయంలో ఆర్ధికసాయమందేలా పోరాటం
  • న్యాయపోరాటంలో దేనికైనా సిద్ధమని నిరూపించిన బత్తుల
  • బలరామునికి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోటికేశవరం గ్రామంలో ఇటీవలే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన దళిత యువకుడు బూల రాంబాబు కాంట్రాక్టర్ దగ్గర కూలిపని చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తుండగా వంతెన నిర్మాణంలో కాంట్రాక్టర్ సరైన ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్య వైఖరితో పని చేయించడంతో నిర్మాణంలో ఉన్స వంతెన వద్ద లోతులో ఉన్న గోతుల దగ్గర నీళ్లు తీస్తుండగా పైనుండి మట్టి బెళ్లలు విరిగిపడి దురదృష్టవశాత్తు రాంబాబు మృతి చెందగా ఆ యువకుడికి కుటుంబానికి కాంట్రాక్టర్ నుండి గానీ, అధికారి పార్టీ గానీ, అధికారులు కానీ ఎటువంటి న్యాయం చేయపోగా, కనీసం బాధిత కుటుంబాన్ని పలకరించలేదు. గవర్నమెంట్ హాస్పటల్ నందు పోస్ట్ మార్టం సమయంలో కూడా బాధితుడి కుటుంబానికి కాంట్రాక్టర్ నుండి ఎటువంటి హామీ లభించలేదు. విషయం జనసేనశ్రేణుల ద్వారా సమాచారం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకుని దళిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను నిలదీయగా వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డుపై మహా ధర్నాతో న్యాయపోరాటానికి దిగారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల జనసేనశ్రేణులు కూడా తోడవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో వందలాది పోలీసులు రంగ ప్రవేశం చేసి, పలుదఫాలు చర్చలు జరిపినప్పటికీ సరైన న్యాయం జరగ లేదన్న భావనతో ధర్నాను బాధిత కుటుంబాలతో కలిసి మరింత ఉదృతం చేశారు. మూడు గంటల ధర్నా అనంతరం మరింత మంది పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని ధర్నా చేస్తున్న బత్తుల బలరామకృష్ణ, ఇతర జనసేన నాయకులను, బాధిత కుటుంబాన్ని అరెస్ట్ చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బత్తుల బలరామకృష్ణ,కొంతమంది జనసేన నాయకుల్ని రాజానగరం పోలీస్ స్టేషన్ కు తరలించగా చుట్టు పక్కల గ్రామాల్లో సమాచారం తెలుసుకున్న జనసేన నేతలు, జనసైనికులు పోలీస్ స్టేషన్ను ముట్టడించి రోడ్డుపై ధర్నాకు దిగగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నత అధికారులు రాజానగరం పోలీస్ స్టేషన్ చేరుకుని బలరామకృష్ణ, బాధిత కుటుంబాలతో పలుదఫాలు చర్చించి కాంట్రాక్టర్ తో మాట్లాడి, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడంతో వివాదం కొంతమేర సద్దుమణిగింది. అనంతరం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకున్న బత్తుల బలరామకృష్ణ బాధిత కుటుంబానికి తక్షణమే 5,00000/- లక్షల రూపాయలు, ఇతర ఖర్చు నిమిత్తం లక్ష రూపాయలు, ఇళ్ల స్థలం, ఇద్దరి చిన్న పిల్లల చదువుకి కావలసిన సౌకర్యాలు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేస్తామనడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో ఆ సొమ్ముని బాధితుడి కుటుంబానికి అందజేయడంతో జనసేన పార్టీ పక్షాన పోరాడి న్యాయం చేసిన బత్తుల బలరామకృష్ణకు దళిత కుటుంబానికి చెందిన పలువురు వ్యక్తులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ ఈ మహాధర్నా అనంతరం పోలీసు నిర్బంధ సమయంలో సహకరించిన జనసేన నాయకులకు, జనశ్రేణులకు, వీరమహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బలరామకృష్ణ ఈ విధంగా పోరాటం చేయకపోతే తమకు ఏ విధంగాను న్యాయం జరిగేది కాదని దళిత కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు బత్తుల బలరామకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగిన ఈ న్యాయపోరాటంలో జనసేన నాయకులు, జనసైనికులు సమిష్టిగా పనిచేయడంతో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యి దళిత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది.