విజయోత్సవ ర్యాలీని తలపించిన బత్తుల భారీ బైక్ ర్యాలీ

  • కదం తొక్కిన జనసైన్యం
  • జనసంద్రంగా మారిన జి. యర్రంపాలెం గ్రామం
  • బత్తుల దంపతులకు అడుగడుగునా జననీరాజనం
  • బైక్ ర్యాలీకి వచ్చిన స్పందన చూస్తుంటే రాజానగరం నియోజకవర్గంలో వైసీపీకి 100% నూకలు చెల్లినట్టే
  • 150వ రోజు పాదయాత్ర వేడుక మరియు బత్తుల జనసేన పార్టీలో మొదటి వార్షికోత్సవ వేడుక గ్రాండ్ సక్సెస్
  • బైకులు ఇతర వాహనాలతో కిక్కిరిసిపోయిన పుణ్యక్షేత్రం, జి. యర్రంపాలెం రహదారి
  • బత్తుల దంపతులను చూసేందుకు భారీగా రోడ్లకు ఇరువైపులా వచ్చిన జనం
  • వారాహి విజయయాత్రకు వస్తున్న ప్రజాధరణను జీర్ణించుకోలేక పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు బత్తుల
  • ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే ఈ అరాచక వైసిపి ప్రభుత్వం పోవాలి
  • యర్రంపాలెం గ్రామం పూర్తిగా జనసేన పక్షం కావడంతో గ్రామస్తులపై వైసీపీ వేధింపులు
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవినీతి వైసీపీకి ఓటేసిన పాపానికి ఇప్పుడు కుమిలిపోతున్నారు
  • పలువురు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వారి అనుచరులు జనసేన పార్టీలో చేరిక
  • రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతి తారాస్థాయికి చేరింది

రాజనగరం నియోజకవర్గం: రాజనగరం మండలం, జి యర్రంపాలెం గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ చేపట్టిన జనం కోసం జనసేన మహా పాదయాత్ర 150వ రోజు వేడుక మరియు జనసేన పార్టీలో బత్తుల మొదటి వార్షికోత్సవ వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో అత్యద్భుతంగా జరిగాయి. ఇందులో భాగంగా ముందుగా పుణ్యక్షేత్రం గ్రామం నుండి నియోజకవర్గంలోని నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వేలాది బైక్లతో, కార్లతో, ట్రాక్టర్లతో ఆటోలతో ర్యాలీగా.. ప్రజా నాయకులు బత్తుల బలరామకృష్ణ గారికి శ్రీమతి వెంకటలక్ష్మి గార్లకు ఘన స్వాగతం పలికి పలికి పెద్దఎత్తున భారీ బైక్ ర్యాలీగా జి. యర్రంపాలెం గ్రామం చేరుకున్నారు.. గ్రామంలో చేరుకోగానే పెద్దఎత్తున బాణసంచా పేల్చుతూ.. తీన్మార్ డప్పులతో, పూలవర్షం కురిపిస్తూ.. యువత కేరింతలతో.. మహిళల హారతులతో.. అడుగడుగునా బత్తుల దంపతులకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కిక్కిరిసిన రోడ్ల వెంబడి పాదయాత్ర చేస్తూ అందరికీ అభివాదం చేస్తూ.. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ఈసారి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ పక్షాన నిలబడాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగిన క్రమంలో.. గ్రామంలో ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు ఘనంగా పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నియోజకవర్గంలోని అనేక మంది సీనియర్ నాయకులు జనసేన పార్టీలో చేరిన బత్తుల దంపతులు ఈ సంవత్సర కాలంలో చేసిన సేవలు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు పేదలకు చేసిన ఆర్థిక సహాయాలు మరియు 150 రోజుల పాదయాత్ర ద్వారా వారు జనసేన పార్టీని రాష్ట్రం నలుమూలలా తెలిసేలా చేసిన తీరును కొనియాడుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా జి.యర్రంపాలెం గ్రామంలోని వైసీపీ సీనియర్ నాయకులు పలువురు వారి అనుచరులు బత్తుల బలరామకృష్ణ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం నియోజవర్గ సీనియర్ నాయకులు దుష్ట పరిపాలన చేస్తున్న వైసీపీ సర్కార్ని తుదమొట్టించాలని దానికి చిహ్నంగా అలానే రెండు వేడుకలు ఒకేసారి చేసుకుంటున్న బత్తుల దంపతులకు వెండి గద, వెండి కత్తి మరియు కళాకృత్యాలు, బహుకరించారు మొదటి జనసేన పార్టీ వార్షికోత్సవ వేడుక మరియు 150వ రోజు పాదయాత్ర జరుపుకుంటున్న బత్తుల దంపతులకు జనసేన నాయకులు దుస్సాలువాలు వేసి గజమానులతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు ఈ సంవత్సర కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు పేదలను ఆదుకున్న తీరు చూపించే చిత్రపటాలను ఈ సందర్భంగా బత్తుల దంపతులకు బహుకరించారు. అనంతరం 150 రోజుల పాదయాత్రకు చిహ్నంగా భారీ కేక్ కట్ చేసి అక్కడికి వచ్చిన చిన్న పిల్లలకు పంపిణీ చేశారు. అనంతరం శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. ఈ సంవత్సర కాలంలో మాకు సహకరించిన నియోజకవర్గంలోని జనసేన నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు.. ఈరోజు ఇంత భారీ కార్యక్రమం ఏర్పాటు చేసిన జి. యర్రంపాలెం జనశ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, ఎవరెన్ని నిందలు వేసినా..పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం మరింతగా పోరాడుతానే తప్ప.. ఎక్కడికి పారిపోమని రామన్న రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో మరింతగా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతానని.. మీ అందరి సహకారం ఇలానే ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. ఈరోజు ఇంతటి చక్కటి బైక్ ర్యాలీ బహిరంగ సభ ఏర్పాటు చూస్తుంటే.. జనసేన పార్టీలో మా బాధ్యత మరింత పెరిగిందని.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని.. రేపు రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పోరాడి.. భారీ మెజారిటీతో రాజానగరం సీటును జనసేన ఖాతాలో వేస్తామని తెలుపుతూ.. 150వ రోజు పాదయాత్ర వేడుకను మరియు మా మొదటి వార్షికోత్సవ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించిన జి. యర్రంపాలెం గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అధికార వైసిపి వారు ఓటమి భయంతోనే.. జనసేన పార్టీపై, తనపై విషం కక్కుతున్నారని.. వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించిన మరింతగా పోరాడుతానే తప్ప ఎక్కడికి పారిపోమని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పార్టీ కోసం పని చేస్తానని.. ప్రజల పక్షాన బలంగా నిలబడతానని.. పవన్ కళ్యాణ్ గారు గర్వపడేలా జనసేన పార్టీని నియోజకవర్గంలో తీర్చిదిద్దుతామని తెలుపుతూ, నియోజకవర్గం 150 పాదయాత్ర వేడుక మరియు మొదటి వార్షికోత్సవ వేడుక ఇంత అత్యద్భుతంగా ఏర్పాటుచేసి, మాకు సత్కారుల అందజేసినందుకు నియోజకవర్గం సీరియల్ నాయకులకు, జనసైనికులకు వీరమహిళలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న ఈ వైసీపీ సర్కార్ను ప్రజలందరూ ఐక్యమై త్వరగా ఇంటికి పంపాలని.. సమాజానికి ఎంతో చేయాలని పరితపిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీపరుడికి ఒక అవకాశం ఇచ్చి, ప్రజలందరూ ఆశీర్వదించి జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తూ ఈ పాదయాత్ర 150 వ రోజు పాదయాత్ర మొదటి వార్షికోత్సవ వేడుక ఘనవిజయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు.. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ ముక్తకంఠంతో ఈసారి జనసేన పార్టీ విజయం కోసం ఎదురుచూస్తున్నామని నియోజకవర్గంలో బత్తుల నాయకత్వాన్ని బలపరుస్తామని ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ జనసేన పార్టీకి గ్రామంలో ఏకపక్షంగా మద్దతు తెలియజేయడం ఈ సందర్భంగా శుభ పరిణామం.. మార్పు బలంగా మొదలైన జి. యర్రంపాలెం గ్రామంలో సుదీర్ఘంగా కొనసాగిన ఈ మహా పాదయాత్ర 150వ రోజు వేడుక, బత్తుల మొదటి వార్షికోత్సవ వేడుక కు జి. యర్రంపాలెం గ్రామ జనసేన పార్టీ వారి ప్రత్యేక ఏర్పాట్లతో అందరూ సమిష్టిగా శ్రమించడంతో అత్యంత విజయవంతమైంది..! బత్తుల పాదయాత్ర 150వ రోజు వేడుక జనసేన పార్టీలో మొదటి వార్షికోత్సవ వేడుక భారీ బైక్ ర్యాలీ, భారీ బహిరంగ సభకు నియోజకవర్గంలోని సీనియర్ జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళలు, జి. యర్రంపాలెం గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.