బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో కరోనా నిబంధనలు పాటించి బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.