చొడిమెళ్ళలో జనసేన చలివేంద్రం ప్రారంభం

ఏలూరు నగరపాలక సంస్థ 27వ డివిజన్ చొడిమెళ్ళలో జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు గురువారం ఉదయం చలివేంద్రాన్ని ప్రారంభించారు. డివిజన్ ఇంచార్జ్ బెజవాడ నాగభూషణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. వేసవి తాపానికి గురి కాకుండా పాదచారులకు, ప్రయాణికులకు, వాహనదారులకు దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, వీరంకి పండు, రెడ్డి గౌరీ, బొండా రాము నాయుడు, బోత్స మధు, కందుకూరి ఈశ్వరరావు, సరిది రాజేష్, చొదిమెళ్ళ జనసైనికులు కలిపాక నాగరాజు, బండి రామకృష్ణ బెజవాడ రామకృష్ణ, రాజుల పటి గోపి చంద్, వేముల చందు, బెజవాడ సాయిరామ్, చిట్టి, బొమ్మ, మేక రమేష్ మురళీ పలగాని చేనీ, బెజవాడ శ్రీరామ్ బత్తిన, గంగోత్రి బెజవాడ సాయి, అంకెన రామకృష్ణ (చిన్న) జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.