డ్వాక్రా మహిళలకు 27వేల కోట్లకుపైగా లబ్ధి

ఏపీ కేబినెట్ ఈరోజు సమావేశంకానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అమరావతిలో ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంపై చర్చించనున్నారు. నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి పొందనున్నారు. అలాగే నూతన పారిశ్రామిక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభంపై చర్చించనున్నారు. అలాగే సెప్టెంబర్‌ 5న ఇచ్చే వైఎస్‌ఆర్‌ విద్యాకానుకకు ఆమోదం తెలపనున్నారు. అలాగే పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.