నేటితో యుగియనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

అద్భుతంగా సాగుతున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్పవాలు నేటితో ముగియనున్నాయి. నిన్న రాత్రి నిర్వహించిన అశ్వవాహన సేవతో వాహన సేవలు ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నపన తిరుమంజనాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు చక్రస్నానం నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ఈ నెల నుంచి 19 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో టీటీడీ బోర్డు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. గతంలో కాకుండా వాహన సేవల సమయాల్లోనూ మార్పులు చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహన సేవలు జరిగాయి.