371 జీఓ రద్దు చేయాలని ఆర్డీఓ కి వినతిపత్రం ఇచ్చిన భైంసా జనసేన

317 జీఓ రద్దు చేసి ఉద్యోగుల భవిష్యత్ ను కాపాడాలని కోరుతు భైంసా పట్టణంలోని రాజాస్వ మండల అధికారి ఆర్డీఓకి జనసేన తరుపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ… ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్థానికతను కోల్పోయే 317 జీఓ ను వెంటనే రద్దు చేయాలని, ఏజన్సీ ప్రాంతాల వారిని నాన్ ఏజన్సీ ప్రాంతాలకి బదిలి చేయడం వల్ల అక్కడ భాష సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా భార్య, భర్తలను వేరే జిల్లాలకి మార్చే ప్రక్రియలో భాగంగా వారి వారి స్థానికతను కోల్పోయే అవకాశం ఉంది. ఆ జీఓ వల్ల బదిలీ అయిన టీచర్ శాశ్వతంగా అక్కడే పని చేయాలనే నిబంధనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. టీచర్స్ సంఘాలను పిలిపించకుండ ఇలాంటి జీఓలని విడుదల చేసి వారి భవిష్యత్తుతో చెలగాటం అడటం సరైన పద్దతి కాదు. టీచర్స్ సంఘాలకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియచేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు రామోజివార్ గంగా ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు.