తిరుమల కొండపైకి భజన బృందాలను అనుమతించడం లేదు

* జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసిన జానపద వృత్తి కళాకారుల సంఘం ప్రతినిధులు
తిరుమల కొండపై హరినామ సంకీర్తన భజన బృందాలను అనుమతించడం లేదని, టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి వైఖరి వల్ల వేలాది మంది భజన కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని జానపద వృత్తి కళాకారుల సంఘం ప్రతినిధులు వాపోయారు. శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిసి తమ బాధలను చెప్పుకొన్నారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. నలభై ఏళ్లుగా ఉన్న సంప్రదాయాన్ని టీటీడీ కాలరాయాలని చూస్తోందన్నారు. తిరుమల కొండపై ఏడాదికి 4320 భజన బృందాలు హరినామ సంకీర్తనలో ఉండేవని, ఇప్పుడు కొండపైన ఆ సంప్రదాయాన్ని ఆపేశారు అన్నారు. ఈ సమస్యను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.