కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో భీం యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ సిటి ఇంచార్జ్ మరియు జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో సిటీ సహాయ కార్యదర్శి కంట రవిశంకర్ ఆధ్వర్యంలో ఆదివారం 6వ డివిజన్లోని రేచర్లపేటలో భీం యాత్రని జరుపుకుంటూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని కొనియాడుతూ రాజ్యాంగదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ సరిగ్గా వొంద సంవత్సరాల క్రిందత ఆనాటి జాతీయకాంగ్రేస్ ఆధ్వర్యంలో కాకినాడలో సభ నిర్వహించేందుకు పిఠాపురం మహరాజా వారు ఈప్రాంతాన్ని ఇచ్చారనీ, ఇదే స్థలంలో ఆనాడు అంటరానితనాన్ని రూపుమాపాలన్న తీర్మానం జరిగిందన్నారు. ఈసభలో అనుకున్న విషయాలతో తరువాత శ్రీ. బాబా సాహేబ్ అంబేడ్కర్ గారి సారధ్యంలో రాజ్యాంగంగా తయారయ్యిందనీ అదే ప్రస్తుతం మన దేశాన్ని నడిపిస్తోందన్నారు. మన రాజ్యాంగం ఇంకో వంద ఏండ్లు ఐయినా చెక్కుచెదరకుండా జాతిని, దేశాన్నీ నడపగలిగే శక్తిని కలిగి ఉందనీ, అలా రాసిన బాబా సాహేబ్ అంబేడ్కర్ గారికి జోహారులు అర్పిస్తూ అంతటి గొప్ప తీర్మానం పురుడుపోసుకున్న ఈ స్థలాన్ని ఇచ్చిన పిఠాపురం రాజావారి గుర్తుగా ఈ ప్రాంతానికి స్థానికులు వారి గోత్రంతో రేచర్లపేట అనే పేరుతో తమ గుండెల్లో నిలుపుకున్నారనీ అలాంటి పిఠాపురం మహరాజుగారికి ధన్యవాదాలు అర్పిస్తూ రాజ్యాంగదినోత్సవాని జరుపుకున్నారు.
ఈసంధర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ నేటి ఈ వై.సి.పి భుత్వం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు దళితులపట్ల చేస్తోందనీ, కానీ ఈసారి వీరి పాచికలు ఏవీ సాగవనీ, దళితులలో చైతన్యం ఉరకలేస్తోందనీ ఈసారి హలో ఏ.పి…. బై బై వై.సి.పి అని అంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల మధు, నాని, బుజ్జి, రవి, రాము, ప్రశాంత్, మణిబాబు, సూరి, రమణమ్మ, ఉమా, బండి సుజాత, దీప్తి, సోనీ ఫ్లోరెన్స్, బట్టు లీల, బోడపాటి మరియ, దుర్గాశివకుమారి, దారపు శిరీష, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివ, జిల్లా కార్యదర్శి అట్లా సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ కమిటీ నాయకులు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.