భీమ్లా నాయక్ విజయోత్సవ వేడుకలు

తూర్పుగోదావరి, పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విజయవంతం అయిన సందర్భంగా పడాల యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు చేశారు. రాజమహేంద్రవరం కుమారి ధియేటర్ వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంచారు. పడాల శ్రీను యూత్ సర్కిల్ సభ్యులు. మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకుని తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పట్టారు. తీన్మార్ డప్పుల సందడిలో పూవులు జల్లుతూ డాన్సులు వేస్తూ హడావిడి చేశారు. అనంతరం పడాల శ్రీనివాసు ఆధ్వర్యంలో కుమారి థియేటర్ వద్ద కేక్ కోసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీమ్లా నాయక్ సినిమా సాధించిన ఘన విజయం పవన్ అభిమానులకు సంతోషం కలిగించిందన్నారు. సినీరంగ చరిత్రలో సంచలనం సృష్టించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీమ్లా నాయక్ సినిమా బ్యానరుతో ధియేటర్లో ప్రదర్శన చేసి విజయోత్సవ సంబరాలు చేశారు. వేడుకల్లో పవన్ కళ్యాణ్ వీరాభిమాని అల్లాడి కవిత, అభిమానులు అర్.రాఘవేంద్ర రావు, రాజేష్, పడాల వెంకటేష్, రమేష్, కుమార్, గేదెల రామకృష్ణ, సబ్బెళ్ళ రమేష్, అర్ రమణ, బి.శ్రీనివాస్, వుండవల్లి రాణీ, ఎం.ప్రసన్న కుమార్, పడాల యశోదా కృష్ణ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు.