వర్షాకాలంలో చెట్ల వలన జరిగే ప్రమాదాలు అరికట్టేందుకు తగు చర్యలు చేపట్టిన భీశెట్టి వసంతలక్ష్మి

జీవీఎంసీ 33వ వార్డులో వర్షాకాలం కారణంగా చెట్ల వలన జరిగే ప్రమాదాలు అరికట్టేందుకు బలహీనంగా ఉన్న మరియు రోడ్డుమీదకు వ్యాపించిన చెట్లు, చెట్ల కొమ్మలను సంబంధిత అధికారుల సహకారంతో దక్షిణ నియోజకవర్గం జివిఎంసి ఫ్లోర్ లీడర్ జనసేన పార్టీ 33వ వార్డ్ కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా భీశెట్టి వసంతలక్ష్మి మాట్లాడుతూ.. నాకు సహకరించిన జీవీఎంసీ హార్టీకల్చర్ సిబ్బంది హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.