గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌బాస్ బ్యూటీ..

బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ మోనల్ గజ్జర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేత్తడి హారిక విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం మోనల్ మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటనని తెలిపింది. అడవులు, పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం ఆనంద్ , మిత్ర గాద్వి , క్రిష్ణ కుల్ శేఖరణ్ , మల్హాత్ థాకర్ లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని మోనాల్ గజ్జర్ కోరారు.