బ్రేకింగ్ న్యూస్ : రియా చక్రవర్తి సుశాంత్ ని మోసం చేసిందంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన బీహార్ ప్రభుత్వం

దివంగత బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్, ఆత్మహత్య కేసును బీహార్ ప్రభుత్వం, సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపిన సీబీఐ, సుశాంత్‌ కేసులో రియాతో పాటు మరో ఐదుగురు ఇంద్రజిత్‌ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, షోయిక్‌ చక్రవర్తి, శామ్యూల్‌ మిరంద, శ్రుతి మోదీ లపై  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అందుకు రియా చక్రవర్తి గురువారం స్పందించింది – సుప్రీంకోర్టులో బిహార్‌ పోలీసుల నుంచి కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రాకముందే సీబీఐ విచారణ ప్రారంభించడం చట్ట విరుద్ధమంటూ అసహనం వ్యక్తం చేశారు.  ఈ మేరకు నిన్న ఓ ప్రకటనను రియా చక్రవర్తి విడుదల చేసింది.

అందుకు బీహార్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రియా చక్రవర్తి, డబ్బులు కోసం సుశాంత్ ని వాడుకుందని  ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈరోజు ఉదయం సుప్రీంకోర్టుకు ఆ అఫిడవిట్ ను బీహార్ ప్రభుత్వం దాఖలు చేసింది. అందులో, సుశాంత్ డబ్బు కోసం రియా చక్రవర్తి మరియు వారి కుటుంబం పకడ్బందీగా పక్కా ప్రణాళికతో అతని దగ్గరికకు చేరారు అని నమోదు చేసింది. అంతేకాకుండా, సుశాంత్ ని బలవంతంగా రియా తన ఇంటికి తీసుకువెళ్లి, ఓవర్ డోస్ మందులను ఇచ్చిందని తెలిపారు. అలాగే అందులో, రియా చక్రవర్తి చెప్పింది చేయకపోతే, తనపై తప్పుడు కేసులు నమోదు చేస్తాను అని బెదిరిస్తున్నారు అంటూ సుశాంత్ అతని చెల్లికి చెప్పినట్టు తెలిపారు. అంతేకాకుండా, సుశాంత్ కుటుంబం మరియు సుశాంత్ బీహార్ లోనే పుట్టి పెరిగారు, అందువల్ల బీహార్ పోలీసులకు ఈ కేసును విచారించడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని బీహార్ ప్రభుత్వం ఆ అఫిడవిట్ లో తెలిపింది