రాజంపేటలో ఘనంగా అతికారి దినేష్ పుట్టినరోజు వేడుకలు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ పుట్టినరోజు సందర్భంగా గురువారం రాజంపేట జనసేన నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో ముందుగా రాజంపేట స్థానిక పాత బస్టాండ్ నందు భారీ బాణసంచా పేల్చి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ భారీగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథి జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో కలసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన దినేష్ కు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, ఘనస్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 25 కేజీల కేకును పార్టీ నాయకుల సమక్షంలో కట్ చేశారు. ఉదయం సిద్ధవటం మండలంలో వెలసిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సిద్ధవటం మండలం జనసేన నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఒంటిమిట్ట చేరుకొని ఒంటిమిట్ట జనసేన నాయకుల సమక్షంలో 15 కేజీల కేకును కట్ చేశారు. తర్వాత నందలూరుకు విచ్చేసిన దినేష్ కు నందలూరు మండల జనసైనికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నందలూరు బస్టాండ్ దగ్గర ఏర్పాటుచేసిన 10 కేజీల కేక్ కట్ చేశారు. అక్కడి నుంచి వీరబల్లి మండలం సానిపాయి గ్రామానికి చేరుకొని వీరబల్లి మండల జనసైనికుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ కి జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, ప్రముఖులు, అభిమానులు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు రెడ్డిరాణి, రూప, కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్, జోగినేని మణి, ఉగ్రణం హేమంత్, జోగినేని మణి మాదాసు నరసింహ, కోలాటం హరికృష్ణ, పోలిశెట్టి శ్రీనివాసులు, నాగరాజు, సర్పంచు ఓబులయ్య, సుండుపల్లి రాజా, ఉల్లి ఉపేంద్ర, కొండల గారి రవి, గుగ్గిళ్ళ చిన్నా, నాగార్జున శంకరయ్య, వెంకటేష్, నాగేష్, సలీం, ప్రశాంత్, మస్తాన్ రాయల్, నరసింహా, తదితరులు పాల్గోన్నారు.