పుట్టిన రోజు గిఫ్ట్ గా నిరుద్యోగులకు 3 లక్షల ఉద్యోగాలు…సోనూ సూద్

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలచిన సోనుసూద్… వ్యక్తిగతంగా తన పరిశీలనకు వచ్చిన వారికి ఆర్థిక సహాయం చేస్తూ తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పించిన ఆయన నిరుద్యోగులకు మూడు లక్షల ఉద్యోగాల కల్పన తన మన లక్ష్యమని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

కరోనా సంక్షోభ సమయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఉపాధి కల్పించడం కోసం ఇప్పటికే ప్రవాస్ రోజగార్ పేరుతో ఉద్యోగ పోర్టల్ను ప్రారంభించారు. తాజాగా ఈ పోర్టల్ ద్వారా 3 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. నా పుట్టినరోజు సందర్భంగా చిరు ప్రయత్నం చేస్తున్నాను ప్రవాసి రోజ్గార్.కాం (http://PravasiRojgar.com) ద్వారా 3 లక్షల ఉద్యోగాలను కల్పించాలని నిర్ణయించా.  మంచి వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ ల తో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి అని ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్భంలో తనతో కలసి పని చేయడానికి సిద్ధమైన సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.