ప్రపంచ రక్తదాతల ఉత్సవాల్లో భాగంగా రక్త దాతలకు ఘన సత్కారం

కదిరి నియోజకవర్గం: కదిరి ప్రభుత్వహాస్పిటల్ నందు వైద్య బృందం 25 సార్లు కు పైబడి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం అందించిన రక్త దాతలను ప్రపంచ రక్తదాతల ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కదిరి డి.ఎస్.పి లత & డాక్టర్స్ రక్త దాతలను, బ్లడ్ డొనర్స్ ఆర్గనైజర్స్ సత్కరించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం అందక ఎవరూ చనిపోకూడదు అంటూ రక్తదాతలే నేటి నవ జీవన స్ఫూర్తి ప్రదాతలు అనే అన్నయ్య చిరంజీవి గారి మాటలను స్ఫూర్తిగా భావించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి మన అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా రక్తదాన శిబిరాలు నిర్వహించడమే కాకుండా ఎంతో మందికి అత్యసర పరిస్థితుల్లో రక్తదాతల సహకారంతో రక్తదానం అందించడం జరుగుతోంది. ఈ క్రమంలోనే 25 సార్లకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలను సత్కరించుకోడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్య బృందానికి కృతజ్ఞతలు. సమయంతో పనిలేకుండా దూరాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రి, పగలు అని తేడా లేకుండా అత్యసర పరిస్థితుల్లో రక్త దానం చేసుకున్న రక్తదాతలే నిజమైన హీరోలుగా భావిస్తున్నాం. మీ సహకారం మాటల్లో చెప్పలేనిది ఏ దానం చెయ్యాలి అన్నా అది డబ్బుతో ముడిపడి ఉంది కేవలం ఒక “రక్తదానం” మాత్రమే మంచి మనస్సుతో ముడి పడి ఉంది. ఒక మెసేజ్ ఒక ఫోన్ కాల్ చేసి అత్యవసరం అనగానే స్పందించి రక్తదానం చేస్తున్న వారికి అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర చిరంజీవి యువత, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ తరపున పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపారు.