బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో రైతుల పక్షాన రిలే నిరాహార దీక్ష

సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో రైతుల పక్షాన రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు కాలం రైతు నారు పోసి, నీరు పెట్టి, యాతవేసి, కలుపు తీసి పిండి జల్లి, మందుకొట్టి, కోత కోసి, కుప్పనురిచి, ఇంటికి వచ్చిన పంట ప్రభుత్వం చూస్తే రైతు భరోసా కేంద్రాలు గిట్టుబాటు ధర కేటాయించి (16,666) ఈరోజు ప్రభుత్వం నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి ఈరోజు రైతు అటు దళారులు ఇటు మిల్లర్లు దోపిడీకి గురవుతుంటే రైతులను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప రైతుల గురించి ఒక్కడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు ఇకనైనా కళ్ళు తెరచి ఈ ప్రభుత్వం రైతు పండించిన పంటను నేరుగా మీరు పెట్టిన గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని జనసేన పార్టీ రైతుల పక్షాన నిలబడి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి ఇందిరా రెడ్డి, పినిశెట్టి మల్లికార్జున్, రహీం భాయ్, బిక్కీ దయాకర్, సందీప్, శ్రీ హరి, రవికుమార్, సురేంద్ర, ఉప్పు పెంచలయ్య, అవినాష్, వంశి, అభిరామ్, హర్షవర్ధన్, చంద్ర, రమేష్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.