ఘనంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక శివ ప్రియ టాకీస్ నందు కేక్ కటింగ్ చేసి 101 గుమ్మడికాయలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి హారతి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షుడు, జనసేన నాయకులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ… మెగా అభిమానుల మధ్య అభిమాన హీరో రామచరణ్ పుట్టినరోజు జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అదేవిధంగా ఇటీవల రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ సినిమాలు రామ్ చరణ్ నటన అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగువారి సత్తాని దేశం నలుమూలల్లో చాటారని కొనియాడారు. ఇకపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నటించబోయే ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ సాధిస్తూ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అభిమాన హీరో పై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, గురు, చైతన్య, గిరి, గోవర్ధన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.