ఆమంచి స్వాములును మర్యాదపూర్వకంగా కలసిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం, కలిచేడు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన కాపునాడు అధ్యక్షులు, ఉద్యమ నేత, రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు, చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఆమంచి స్వాములు ను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో కలిసి బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆమంచి స్వాములు ను శాలువతో సన్మానించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపునాడు అధ్యక్షుడిగా ఎన్నో సేవలందించి, ఒక మంచి వ్యక్తిగా పేరుపొందిన ఆమంచి స్వాములు వైసిపి పార్టీలో సిద్ధాంతాలు నచ్చక రాష్ట్రం అభివృద్ధి లేకపోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చూస్తూ ఉండలేక, మార్పు కోసం వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయనతో ఆయనకున్న మంచి సంబంధాలు, అదేవిధంగా రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో ఇటీవల చేరడం జరిగింది. జనసేన సిద్ధాంతాలు నచ్చి ఒక బలమైన నాయకుడిగా ఉన్నటువంటి చీరాల నియోజకవర్గ నాయకులు, కాపు ఉద్యమ నేత ఆమంచి స్వాములు గారు జనసేన పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం, కలిచేడు గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి రావడంతో ఆమంచి శ్రీరాములు గారిని మర్యాదపూర్వకలవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, సందీప్, వంశి, సాయి తదితరులు పాల్గొన్నారు.