జనసేన నాయకుల అరెస్టులను ఖండించిన బొబ్బేపల్లి సురేష్

నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటే సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అనే వ్యక్తి నెల్లూరు జిల్లాలో ఉండకూడదా ఉంటే అరెస్టులు చేస్తారా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా..? సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలో దామోదరం సంజీవయ్య మాజీ దివంగత దళిత ముఖ్యమంత్రి పేరు మీద కొనసాగుతున్న ప్రభుత్వ రంగ పవర్ ప్లాంట్ ని గురువారం మూడవ గ్రిడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నాడని అరెస్టులు చేయడం ఆయన వెళ్ళిపోయిన తర్వాత వదలడం ఎంతవరకు సబబు. దామోదరం సంజీవయ్య పేరు మీద ఉన్న ధర్మాల్ పవర్ ప్లాంట్ మూడవ గ్రిడ్డు ఈరోజు ప్రారంభం చేసి రేపు అదానికి అప్పజెప్పడానికా..? అని ఎద్దేవా చేసారు. మనుబోలు గణపతి, నరసింహ, సందీప్, శ్రీహరి తదితరులు ఉన్నారు.