మిచౌంగ్ తుఫాన్ బాధితులకి దుప్పట్లు పంపిణీ చేసిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి: సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం, తోటపల్లి పంచాయతీలోని 17 గిరిజన కుటుంబాలు తుఫాన్ కారణంగా గుడిసెలోకి నీళ్ళు రావడంతో కోడూరు పంచాయతీ నందు స్కూల్లోకి తరలించారు. తుఫాన్ బాధితులకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు వారికి బెడ్ షీట్ పిల్లలకి బిస్కెట్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాదుతూ వారికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చాము. రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం జరుగుతుంది. అపుడే పేద, బడుగు-బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఎం. శరత్, కె. శ్రీనివాసులు, ఎస్. శ్రీహరీ, ఎం వంశీ తదితరులు పాల్గొన్నారు.