రైతులు సహా ప్రతి ఒక్కరిని మోసగించడం సీఎం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య

మదనపల్లె, ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు ఏడాదికి పన్నెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. కిసాన్ యోజన కింద కేంద్రం ఇచ్చే ఆరువేల రూపాయలు రాష్ట్రం వాటా 7500 కలిపి 13500 ఇస్తున్న సీఎం జగన్ మొత్తం తానే ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి రైతుకు 20,000 ఎగ్గొట్టి రైతులను మోసగిస్తున్నది నిజమా కాదా?? రాష్ట్రంలో 15 లక్షల మంది రైతులు ఉంటే 1.50 లక్షల మందికి రైతు భరోసా కింద 7500 రూపాయలు ఇస్తూ వారి జీవితాలను మార్చేస్తున్నట్లు సీఎం జగన్ డబ్బా కొడుతున్నారు. రైతులకు ఇచ్చింది గోరంత అయితే విత్తనాలు, ఎరువులు విద్యుత్ చార్జీల పెంపు, వ్యవసాయ మోటార్లు మీటర్ల, పేరుతో లెక్కల్లో చెప్పలేనంత. లక్షల లోపు ఋణాలకు ఉచిత వడ్డీ అని సీఎం అన్నారు. ఎక్కడైనా అమలవుతుందా. కేంద్ర సహకార బ్యాంకులు రుణం తీసుకున్న రైతుల నుండి బలవంతంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. జొన్న మొక్కజొన్న కొనుగోలు పేరుతో రైతు భరోసా కేంద్రాన్ని అడ్డంపెట్టుకుని వైకాపా నేతలు లక్షాదికారులు అయితే రైతులు మాత్రం బికారులవుతున్నారు. అప్పులపాలై ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి రైతుల జీవితాలలో నింపిన వెలుగు అని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అన్నారు.