తిరుమలమ్మపాలెం వంతెనను పరిశీలించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి: వెంకటాచలం మండలం, తిరుమలమ్మపాలెం గ్రామం వద్ద ఉన్న వంతెనను ఆదివారం జనసేన పార్టీ నాయకులతో కలిసి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ తిరుమలమ్మపాలెం గ్రామస్తుల ఎన్నో ఏళ్ల కల ఈ వంతెన నిర్మాణం మాత్రం కలలాగే మిగిలిపోయినటువంటి పరిస్థితి. వర్షాలు, వరదలు వస్తే రాకపోకలకు అంతరాయం 2018లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.935 లక్షల రూపాయల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా గెలిచి నేడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం వంతెన నిర్మాణాన్ని గాలికి వదిలేశారు 2018 నుంచి నేటి వరకు ఆ యొక్క వంతెన నిర్మాణం గురించి మాట్లాడటం గాని, ఆ వంతెన నిర్మాణానికి కేటాయించిన నిధుల గురించి గానీ ఎక్కడా కూడా ప్రస్తావించిన దాఖలు లేవు. అయితే ఐదు నెలల క్రితం దామోదరం సంజీవయ్య గారి థర్మల్ పవర్ ప్లాంట్ మూడవ గ్రిడ్ ఓపెనింగ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు వచ్చినప్పుడు భారీ బహిరంగ సభలో ఇప్పుడు అధికారపక్షంలో మంత్రి పదవి పొందినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు 12 కోట్ల రూపాయలతో ఉప్పుకాలపై వంతెన నిర్మాణం కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నిధులు కూడా అడిగాం అని చెప్పే ఆ రోజు ఆయన భారీ బహిరంగ సభలో తెలియజేయడం జరిగింది. ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఆ వంతెన నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడం కానీ, దానిని ప్రారంభించడానికి అడుగు ముందుకు వేయడం గాని జరిగిన దాఖలాలు లేవు. మరి ఎన్నికల రాబోతున్నాయి రానున్న ఎన్నికలను చూపించి ఈసారి మళ్లీ మూడోసారి ఆయనని గెలిపిస్తే అప్పుడు ఏమన్నా ఈ బ్రిడ్జి గురించి మాట్లాడుతారా..?. ఈ పిచ్చి పనులు కొనసాగిస్తాడా లేదంటే తిరుమలముపాలెం గ్రామస్తులకి ఈ వంతెన నిర్మాణం కలలాగే మిగులుస్తారా ఇకనైనా సరే తిరుమలమ్మపాలెం గ్రామస్తులు కూడా కళ్ళు తెరిచి ఈ బూటకపు మాటలు చెప్పి కాలయాపన చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారా లేదంటే నిలదీసి వంతెన నిర్మాణం గురించి అడుగుతారా..? అని జనసేన పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రెండుసార్లు ప్రజలు ఓట్లేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గెలిపిస్తే మరి అభివృద్ధి అని అంటున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గం లో రెండు సార్లు కూడా ఆయన అభివృద్ధి చేసింది లేదు. ఆయన మాటలు గారడి మాత్రమే చేస్తున్నాడు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ప్రజలు ఈ బూటకపు మాటలు నమ్మే రోజులు పోయినాయి, రాబోయే రోజుల్లో వీళ్ళకి కచ్చితంగా బుద్ధి చెప్తారు అని చెప్పి జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నానని సురేష్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీహరి, శ్యాంసుందర్, విజయ్ కుమార్, నవీన్, ముత్తుకూరు మండల నాయకులు రహీం, అక్బర్ బాషా, మల్లి, ఫణిబాబు, చిన్న, శ్రీహరి, రహమాన్, సన్నీ పవన్, తేజ, మోహన్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.