అంబేడ్కర్ కు నివాళులర్పించిన బోడపాటి రాజేశ్వరి

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి మాట్లాడుతూ అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురై బీదరికాన్ని ఎదుర్కొంటు, స్వయంకృషితో కేంద్రమంత్రిగా, రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన డాక్టర్. బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలు మనందరికీ ఆదర్శమని అన్నారు.