ఆంధ్రా యూనివర్సిటికి దళిత వి.సి ని నియమించాలని బోడపాటి శివదత్ వినతి

విశాఖ పట్టణం, శ్యామలరావు ఐఏఎస్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ వారిని విశాఖ కలెక్టర్ కార్యాలయం నందు కలిసి దళిత మహిళను ఏయు రెగ్యులర్ వైస్ ఛాన్సలరుగా నియమించాలని వినతిపత్రాన్ని అందించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్. 1926లో స్థాపించబడ్డ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పటికి 98 సంవత్సరాలు పూర్తవుతున్న ఒక దళిత మహిళను రెగ్యులర్ వైస్ ఛాన్సలరుగా నియమించిన సందర్భం లేదు. గతంలో వున్న ప్రసాద్ రెడ్డి పదవీకాలం పూర్తి అయినందున, ఇప్పుడు నియమించబోయే రెగ్యులర్ వైస్ ఛాన్సలరుగా దళిత మహిళను నియమించవలసిందిగా జనసేన పార్టీ తరుపున కోరుతున్నామని ఇప్పుడు ఇంచార్జి వైస్ ఛాన్సలర్ గా ఉన్న కె సమతకి జరిగిన అవమానాన్ని కూడా శ్యామల రావుకి పూర్తిగా వివరించడం జరిగింది. దళిత మహిళలను గౌరవించ వలసిన ఆవస్యకత ఏంతైనా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలిపారు.